వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ‘కళ్యాణం కమనీయం జీవితం’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. రవి లోకిరెడ్డి దర్శకత్వంలో ఖాన్ దురాని, సాహితి ఆవంచ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్టర్ను ఆవిష్కరించిన విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ టైటిల్ ఎంతో ఆకట్టుకుందని, దర్శకుడి విజన్ పోస్టర్లోనే కనిపిస్తోందని ప్రశంసించారు. చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాతలు సినిమా కథపై నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ను నిర్మించామని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని తెలిపారు. దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ ప్రేమ, సస్పెన్స్ అంశాల కలయికతో ఉత్కంఠభరితమైన కథను తెరకెక్కించామని, ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా సినిమా రూపొందించామని చెప్పారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజవంశీ రిలీజ్ చేయనున్న ఈ సినిమాపై పోస్టర్ విడుదలతో మంచి ఆసక్తి నెలకొంది.
- June 29, 2026
0
5
Less than a minute
You can share this post!
editor

