“ఇక్కడ ఎథిక్స్ ఉండవు.. ఓన్లీ ట్రిక్సే!”.. ఈ స్టూడెంట్ ఎవరు?

“ఇక్కడ ఎథిక్స్ ఉండవు.. ఓన్లీ ట్రిక్సే!”.. ఈ స్టూడెంట్ ఎవరు?

మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న ‘స్టూడెంట్’ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. బాలు తత్వమసి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజేత పరీక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ కథలో సరదాగా జీవితం గడిపే స్టూడెంట్ భాను అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. అక్కడ ఎదురయ్యే కుట్రలు, సవాళ్లు, ఎత్తులకు పైఎత్తులతో అతని ప్రయాణం ఎలా సాగిందనే విషయాన్ని టీజర్ ఆసక్తికరంగా చూపించింది. “ఇక్కడ ఎథిక్స్ ఉండవు.. ఓన్లీ ట్రిక్సే!” అనే పవర్‌ఫుల్ డైలాగ్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రేమ, రాజకీయాలు, యాక్షన్, ఎమోషన్‌ల కలయికతో రూపొందిన ఈ టీజర్ సినిమాపై మంచి అంచనాలు పెంచింది. యంగ్ పొలిటీషియన్‌గా మేఘాంశ్ శ్రీహరి తన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోగా, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, నిర్మాణ విలువలు ప్రత్యేకంగా మెప్పిస్తున్నాయి. కాలేజ్ పాలిటిక్స్‌ను కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నంగా కనిపిస్తున్న ‘స్టూడెంట్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. సినిమా విడుదలపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.

Related Articles