కార్‌ పార్కింగ్‌ కోసం 30 కోట్లు వెచ్చించిన కాజోల్

కార్‌ పార్కింగ్‌ కోసం 30 కోట్లు వెచ్చించిన కాజోల్

నాటి యువతరం కలలరాణి కాజోల్‌ ఇప్పుడు బీ టౌన్‌లో చర్చనీయాంశంగా నిలిచారు. తన అయిదు కార్ల పార్కింగ్‌ కోసం 30 కోట్లతో ఆమె ఓ స్థలాన్ని కొనుగోలు చేయటమే ఈ చర్చకు ప్రధాన కారణం. బాలీవుడ్‌ కథనాల ప్రకారం భారత్‌ రియాలిటీ వెంచర్స్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ నుండి 4 వేల 365 గజాల రిటైల్‌ స్థలాన్ని, గజానికి 65 వేల 940 రూపాయలు చెల్లించి కాజోల్‌ కొనుగోలు చేశారట. అది కూడా కేవలం తన అయిదు కార్ల పార్కింగ్‌ కోసం. ఈ వార్త సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. సినీ వర్గాల్లో అయితే.. చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కాజోల్‌ పలు వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆమె నటించిన ‘మా’ అనే సినిమా జూన్‌ 7న విడుదల కానుంది.

editor

Related Articles