త్వరలో ఝాన్సీ నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’

త్వరలో ఝాన్సీ నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’

తెలుగు యాక్టర్ అశోక్‌ గల్లా నటిస్తోన్న సినిమా దేవకీ నందన వాసుదేవ. ఈ సినిమాకి గుణ 369 ఫేం అర్జున్‌ జంధ్యాల డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ నటి ఝాన్సీ దేవకి పాత్రలో నటిస్తోంది. తాజాగా మేకర్స్‌ ఝాన్సీ లుక్ విడుదల చేస్తూ.. కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ షేర్ చేశారు. ఝాన్సీ చేతిలో కర్ర పట్టుకొని యుద్ధానికి బయలుదేరినట్టు కనిపిస్తున్న స్టిల్ నెట్టింట వైరల్‌గా మారింది. ఝాన్సీ తన కొడుకు కోసం ఫైట్ చేసే తల్లిగా కనిపించబోతున్నట్టు పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్‌. ఝాన్సీ రోల్‌ సినిమాకే హైలెట్‌గా ఉండబోతోందని హింట్‌ ఇచ్చేస్తున్నాడు డైరెక్టర్‌. ఈ సినిమాని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ (ఎన్‌ఆర్‌ఐ) నిర్మిస్తున్నారు. సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది.

administrator

Related Articles