మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమాలో తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన బయోపిక్ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియస్వామి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా చాలా బాగా నటించింది. సినిమా హిట్‌కి తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ క్రమంలోనే అమరన్ విడుదలైన మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. పైగా శివకార్తికేయన్ కెరీర్‌లోనే అత్యంత వేగవంతంగా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఇటు తెలుగులో కూడా ఈ సినిమా హిట్ అయ్యింది. ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ చిత్రాన్ని చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా థియేటర్లకు వెళ్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకా సాలిడ్ కలెక్షన్స్‌ను రాబట్టే అవకాశం ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాకి సి.హెచ్. సాయి సినిమాటోగ్రఫీ అందించారు. కమల్‌హాసన్, ఇతరులు ఈ సినిమాని నిర్మించారు.

- November 4, 2024
0
26
Less than a minute
Tags:
You can share this post!
administrator