జీవా, అర్జున్ సర్జా యాక్ట్ చేసిన ఫాంటసీ హర్రర్ థ్రిల్లర్ ‘అగత్యా’. గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా హీరోయిన్. ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘సుమారు 120 ఏళ్ల క్రితం చనిపోయిన ఆత్మలను మీరు ఇప్పుడు కలుసుకోబోతున్నారు’ అనే వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకుంది. గ్రామీణ నేపథ్యంలో హర్రర్, థ్రిల్లింగ్ అంశాలతో కొత్త అనుభూతిని కలిగించింది. జీవా, అర్జున్ సర్జా పర్‌ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. ‘అవెంజర్స్’ తరహాలో ప్రేక్షకులను సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ఇది. స్పెషల్ ఎఫెక్ట్స్ అబ్బురపరుస్తాయి. యువన్‌శంకర్ రాజా మ్యూజిక్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది.

- February 13, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor