ఆప్యాయత పంచే సుశీలమ్మగా జయసుధ

ఆప్యాయత పంచే సుశీలమ్మగా జయసుధ

చిన్ననాటి వేసవి సెలవుల మధుర జ్ఞాపకాలు, కుటుంబ బంధాలు, అమ్మమ్మ -మనవళ్ల అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించే బాలల సినిమా ‘సమ్మర్ హాలీడేస్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. మాస్టర్ రోహన్, అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో సీనియర్ నటి జయసుధ ‘సుశీలమ్మ’ అనే అమ్మమ్మ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సంప్రదాయ దుస్తుల్లో ఆప్యాయమైన చిరునవ్వుతో కనిపించిన జయసుధ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రేమ, ఆప్యాయత, కుటుంబ విలువలను పంచే అమ్మమ్మగా ఆమె పాత్ర సినిమా కథకు ప్రధాన బలంగా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు.

ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, ‘సమ్మర్ హాలీడేస్’ కూడా అన్ని వయసుల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా పిల్లలు, తల్లిదండ్రులు కలిసి ఆస్వాదించేలా ఈ సినిమాని రూపొందించినట్లు వెల్లడించింది.

ఈ సినిమాలో రాజీవ్ కనకాల, వాసుకి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సింజిత్ యెర్రమల్లి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కథ, దర్శకత్వం శ్రీకర్ వహించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Related Articles