ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువగా వాడుతున్న టెక్నాలజీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). చిన్న పిల్లల నుండి పండు ముదుసలి వరకు ఎక్కడో ఒక చోట దీని సేవలు అందుకుంటూనే ఉన్నారు. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించి రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌లో ఒక పాట కంపోజ్ చేశాం అని చెప్పిన సంగీత దర్శకుడు థమన్. రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలోకి జరగండి, జరగండి పాటను ఏఐతో కంప్లీట్ చేశాం. మొదట ఈ పాటను దలేర్ మెహందీతో మొదట పాడించాం. కానీ అయనతో పాడించినప్పుడు గట్టిగా పాడలేకపోయారు. బాద్‌షా సినిమాలోని ‘బంతి పూల జానకీ’ పాడింది దలేర్ మెహందీనే.. అంత ఎనర్జీతో ఇప్పుడు ఆయన పాడలేకపోతున్నారు. దీంతో నాకు తెలిసిన ఒక సింగర్‌తో ఈ పాట పాడించి.. అది ఏఐలో వేసి దలేర్ మెహందీ పాడినట్లు క్రియేట్ చేశాం. కానీ అసలు పాడింది సింగర్ హన్‌మాన్ అంటూ సీక్రెట్ చెప్పేసిన థమన్.

- January 8, 2025
0
12
Less than a minute
Tags:
You can share this post!
editor