హాలీవుడ్ క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇంటర్‌స్టెల్లార్. 2014లో విడుదలైన ఈ సినిమా హలీవుడ్‌లోనే కాకుండా ఇండియాలోను మంచి కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ రీ రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాను ఐమాక్స్ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేయనుండగా.. ఇండియాలో కాకుండా వరల్డ్ వైడ్‌గా విడుదల చేస్తుంది చిత్రబృందం. దీనికి ముఖ్య కారణం ఇండియన్ ఐమాక్స్‌ల్లో ‘పుష్ప 2’ ఉండటం. దీంతో ఇండియన్స్‌కు అసలు సినిమాలు చూడడం రాదని.. సైన్స్ ఫిక్షన్ వదిలేసి మాస్ సినిమాలకు ఎంకరేజ్ చేస్తున్నారని కొందరు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ వివాదంపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ స్పందిస్తూ.. ‘పుష్ప2’ సినిమాకు మద్దతుగా నిలిచింది. జాన్వీ మాట్లాడుతూ.. ‘పుష్ప 2’ కూడా ఒక సినిమానే కదా.. ఇంటర్‌స్టెల్లార్ సినిమాతో ఈ సినిమాను పోలుస్తూ ఎందుకు తక్కువ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అన్న జాన్వీకపూర్.

- December 7, 2024
0
29
Less than a minute
Tags:
You can share this post!
editor