బెస్ట్‌ సినిమా.. అమరన్‌పై జాన్వీ కపూర్‌ ప్రశంసలు

బెస్ట్‌ సినిమా.. అమరన్‌పై జాన్వీ కపూర్‌ ప్రశంసలు

తమిళ హీరో శివ కార్తికేయన్, న‌టి సాయి ప‌ల్లవి  ప్రధాన పాత్రల్లో న‌టించిన అమ‌రన్ సినిమాకి బాలీవుడ్‌ స్టార్‌ నటి జాన్వీకపూర్‌ రివ్యూ ఇచ్చారు. ఇండియాస్‌ మోస్ట్ ఫియ‌ర్‌లెస్ అనే పుస్తకంలోని మేజర్‌ వరదరాజన్‌ కథ ఆధారంగా వ‌చ్చిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియస్వామి ద‌ర్శక‌త్వం వ‌హించారు. దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. శివ కార్తికేయ‌న్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిల‌వ‌డమే కాకుండా రూ.300 కోట్లకు పైగా వ‌సూళ్లను రాబ‌ట్టింది. తాజాగా ఈ సినిమాకి బాలీవుడ్‌ హీరోయిన్ జాన్వీకపూర్‌  రివ్యూ ఇచ్చారు. ఈ ఏడాది ‘అమరన్‌’ బెస్ట్‌ సినిమా అని పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘అమరన్‌’ సినిమాని చూడటం కాస్త ఆలస్యమైనట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం తన హృదయానికి హత్తుకుపోయిందని, కదిలించిందని.. ఒక మంచి సినిమాతో ఈ ఏడాదిని ముగించినట్లు జాన్వీ తన స్టోరీస్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

editor

Related Articles