పెళ్లి తర్వాత అమ్మాయిల ఇంటిపేర్లు మారటం సహజం.. తమ పేర్ల వెనుక భర్తల పేర్లు యాడ్ అవ్వడం కూడా ఎప్పటినుండో వస్తున్న ఆనవాయితీ. అయితే.. వరలక్ష్మి శరత్‌కుమార్ భర్త అయిన నికోలయ్ సచ్‌దేవ్ ఆ ఆనవాయితీని బ్రేక్ చేశారు. తాజాగా తన పేరును ‘నికోలయ్ సచ్‌దేవ్ వరలక్ష్మీ శరత్‌కుమార్’గా మార్చుకొని వార్తల్లోకి ఎక్కారు. ఈ విషయంపై రీసెంట్‌గా వరలక్ష్మి మాట్లాడుతూ ‘పెళ్లి తర్వాత నా జీవితంలో వచ్చిన మార్పేం లేదు. కానీ, నా భర్త నికోలయ్ జీవితం మాత్రం మారిందని అనుకుంటున్నాను. నాకోసం ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. తన పేరులో నా పేరును కలుపుకొని నికోలయ్ సచ్‌దేవ్ వరలక్ష్మి శరత్‌కుమార్‌గా మారారు. కెరీర్ పరంగా నేను ఇంకా ఎంతో సాధించాలనే ఆరాటం, తపన ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. వర్క్ విషయంలో నాలో స్ఫూర్తి నింపుతున్నారాయన. పెద్దల అంగీకారంతో ఓ మంచి మనిషిని పెళ్లి చేసుకున్నందుకు ఆనందంగా ఉంది.

- February 1, 2025
0
22
Less than a minute
Tags:
You can share this post!
editor