మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న ఈ సినిమాలో వివిధ భాషలకు చెందిన పెద్ద యాక్టర్లు నటిస్తున్నారు. శివపార్వతులుగా అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. ‘కన్నప్ప’ సినిమాలో హీరో ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన వారిద్దరి పాత్రల తాలూకు ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కు మంచి స్పందనే వచ్చింది. దాంతో సినిమాలో ప్రభాస్ పాత్ర విశేషాలతో పాటు ఆయన ఫస్ట్‌లుక్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 3న ప్రభాస్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సినిమాలో ప్రభాస్.. మానవరూపంలో కనిపించే నందీశ్వరుడి పాత్రను పోషించారని తెలిసింది. ఆయన పాత్ర నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. ఈ వార్తలపై స్పష్టత రావాలంటే ఫిబ్రవరి 3 వరకు వేచి చూడాల్సిందే. ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మోహన్‌బాబు భారీ వ్యయంతో వెండితెరపై చూపెట్టబోతున్నారు.

- January 28, 2025
0
28
Less than a minute
Tags:
You can share this post!
editor