సినిమాల విషయంలో చాలా ఆచి తూచి అడుగులు వేస్తుంది బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్. జయాపజయాలకు అతీతంగా గత కొన్నేళ్లుగా చాలెంజింగ్ రోల్స్‌కి ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా ఈ హీరోయిన్ బాలీవుడ్‌లో మరో పెద్ద సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోందని తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ‘రాన్‌జనా’ (2013) సినిమా హృద్యమైన ప్రేమకథగా ఆకట్టుకుంది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో ‘తేరే ఇష్క్ మే’ పేరుతో మరో లవ్‌స్టోరీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టి సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇప్పటివరకూ వెల్లడించలేదు. ఆదివారం సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఓ మహిళ వాయిస్‌ను బట్టి అది కృతిసనన్‌దేనని ఫ్యాన్స్ ఒక అభిప్రాయానికి వచ్చారు. దాంతో ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన రాబోతోందని తెలుస్తోంది.

- January 28, 2025
0
25
Less than a minute
Tags:
You can share this post!
editor