సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవకాశాల కోసం వెళ్లినప్పుడు, చిత్రీకరణ సమయంలో కొందరు తారలు కాస్టింగ్ కౌచ్‌కు గురవుతున్నారు. తమకు ఎదురైన ఆ చేదు అనుభవాలను ఏదో ఒక సందర్భంలో బయటపెడుతున్నారు. అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఫాతిమా సనా షేక్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో తాజాగా పంచుకున్నారు. ఓ సినిమా కోసం అడిషన్‌కు వెళ్లాను. అక్కడ మీరు ఏం చేయడానికైనా సిద్ధమేనా..? అంటూ ఓ డైరెక్టర్ నన్ను అడిగాడు. కష్టపడి పనిచేస్తానని.. నా పాత్ర కోసం ఏది అవసరమో అది చేస్తానని చెప్పా. కానీ, అతను మాత్రం అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగాడు. ఇక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్‌గా మాట్లాడుకుంటారని నటి పేర్కొంది.

- January 28, 2025
0
22
Less than a minute
Tags:
You can share this post!
editor