డైరెక్టర్ పూరి జగన్నాథ్.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత కొత్త సినిమా కోసం రెడీ అయ్యాడు. కింగ్ నాగార్జునకు ఓ కథ వినిపించబోతునట్లు తెలుస్తోంది. అన్నట్టు వీరిద్దరి కాంబోలో గతంలో సూపర్, శివమణి అనే రెండు చిత్రాలు వచ్చాయి. ఆ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కాంబో మళ్లీ రిపీట్ కాబోతోందని తెలుస్తోంది. ఐతే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో రామ్ పోతినేని హీరోగా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్‌ను తెచ్చుకోలేకపోయింది. ముఖ్యంగా పూరి గతంలో సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయ్యింది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో పూరి, నాగార్జున కోసం ఎలాంటి కథను రాశాడో చూడాలి. ఇంతకీ, నాగార్జున – పూరి కలయిక ఫిక్స్ అవుతుందో లేదో కూడా వేచి చూడాలి.

- March 9, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor