Investigative Thriller ‘హత్య’

Investigative Thriller ‘హత్య’

ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్‌, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘హత్య’. శ్రీవిద్య బసవ దర్శకురాలు. మహాకాళ్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ప్రశాంత్‌ రెడ్డి తీస్తున్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ ‘అందరికి తెలిసిన కథే అయినప్పటికీ గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా సినిమాను తెరకెక్కించాం. సాంకేతికంగా ప్రతి అంశంలో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. నరేష్‌ అందించిన బీజీఎమ్‌, అభిరాజ్‌ విజువల్స్‌ హైలైట్‌గా నిలుస్తాయి’ అని చెప్పారు. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని, ఇందులో ఛాలెంజింగ్‌ రోల్‌ చేశానని నటుడు రవివర్మ తెలిపారు. కథాగమనంలో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని పూజా రామచంద్రన్‌ పేర్కొన్నారు. ఈ సినిమాకి కెమెరా: అభిరాజ్‌ రాజేంద్రన్‌ నాయర్‌, సంగీతం: నరేష్‌ కుమారన్‌.

editor

Related Articles