పద్మభూషణ్ అవార్డు అందుకోబోతున్న బాలకృష్ణకు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నటుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను బాలయ్యను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుతో సత్కరించనుంది. ఇక బాలయ్యకు పద్మా అవార్డు రావడంతో సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు విషెస్ తెలుపుతున్నారు. తాజాగా పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్న హీరో అల్లు అర్జున్ కూడా బాలయ్యకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకి హృదయపూర్వక అభినందనలు. బాలయ్యతో పాటు పద్మభూషణ్ వరించిన హీరో అజిత్ కుమార్‌తో పాటు శోభన, శేఖర్ కపూర్, అనంత్ నాగ్‌లకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు.

- January 27, 2025
0
26
Less than a minute
Tags:
You can share this post!
editor