రామ్‌చరణ్ సినిమాపై ఇండియన్ 2 ప్రభావం ఏమీ పడదు..

రామ్‌చరణ్ సినిమాపై ఇండియన్ 2 ప్రభావం ఏమీ పడదు..

రామ్‌చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న అవైటెడ్ సినిమా “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా దగ్గర టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌తో చరణ్ చేసిన ఫస్ట్ సినిమా ఇది. కాగా, మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు ఎప్పటి నుండో పీక్స్‌లో ఉన్నాయి. ఈ సినిమా టీజర్‌కి రంగం సిద్ధమయ్యింది. రామ్ చరణ్‌తో శంకర్ నుండి ఇండియన్ 2 లాంటి సినిమా ఫలితం తర్వాత ఎలా ఉంటుందా దాని ఎఫెక్ట్ దీనిపై ఖచ్చితంగా ఉంటుందని చాలామంది భావించారు కానీ, ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇండియన్ 2 ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్‌పై అంతగా ఉండదనే చెప్పాలి, ఎందుకంటే ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు కాబట్టి అలానే అనిపిస్తోంది. మెయిన్‌గా టీజర్‌కి ముందు వదిలిన గ్లింప్స్ అయితే శంకర్ మార్క్ కమర్షియల్‌గా కనిపిస్తోంది. దీంతో ఇండియన్ 2 ఎఫెక్ట్ లేకుండా ఫ్రెష్‌గా సాలిడ్ హైప్ ఇచ్చేలా ఇది కనిపిస్తోంది.

administrator

Related Articles