మరోసారి తల్లి కాబోతున్న ఇలియానా!

మరోసారి తల్లి కాబోతున్న ఇలియానా!

హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం సినీ రంగానికి దూరంగా ఉంటోంది. పైగా ఇప్పటికే, 2023లో బాబుకు జన్మనిచ్చింది. కాగా.. ఇలియానా మళ్లీ తల్లి కాబోతోందని వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె ఓ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ రూమర్స్ బాగా వినిపించాయి. ఐతే, తాజాగా ఈ రూమర్స్‌కి ఇలియానా చెక్ పెట్టింది. నిజంగానే ఇప్పుడు తాను గర్భవతినని, మరోసారి తాను తల్లి కాబోతునట్లు ఇలియానా సోషల్ మీడియా సాక్షిగా క్లారిటీ ఇచ్చింది. ఏది ఏమైనా ఇలియానా ఒకానొక సమయంలో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. తెలుగులో దేవదాసు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. పోకిరి హిట్‌తో టాప్ రేంజ్‌లో కొనసాగింది. పైగా తొలి సినిమాతోనే అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ హీరోయిన్‌కి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. చాలా కాలం పాటు టాప్ హీరోయిన్‌గా కొనసాగింది.

editor

Related Articles