ఎక్కడైనా బయట కనబడితే ఈమధ్య నన్ను గుర్తుపడుతున్నారు…

ఎక్కడైనా బయట కనబడితే ఈమధ్య నన్ను గుర్తుపడుతున్నారు…

‘సినిమాల్లో నటించే అవకాశం అందరికీ రాదు. అదొక గొప్ప వరంగా భావించాలి. ఉత్తమమైన కథల్ని ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్ని పోషించాలనుకుంటున్నా. ఆమె వెంకటేష్‌ సరసన కథానాయికగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఐశ్వర్యరాజేష్‌ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ సినిమా ఆద్యంతం చూస్తుంటే నవ్వాపుకోలేపోయా. అంత గొప్పగా కామెడీ పండింది. ఈ సినిమాలో నేను భాగ్యం అనే ఇల్లాలి పాత్రలో కనిపిస్తా. భిన్న భావోద్వేగాలతో సాగే పాత్ర ఇది. ఏ కొంచెం బ్యాలెన్స్‌ తప్పినా పాత్ర ఔచిత్యం దెబ్బతింటుంది. అందుకే చాలా హుందాగా కనిపించేందుకు ప్రయత్నించా’ అని చెప్పింది. వెంకటేష్‌ వంటి సీనియర్‌ నటుడితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, ‘భాగ్యం క్యారెక్టర్‌లో అదరగొడుతున్నావ్‌’ అంటూ ఆయన ఎప్పుడూ నన్ను ప్రోత్సహించేవారని హీరోయిన్ పేర్కొంది. సినిమాలోని ‘గోదారి గట్టు..’ పాట బాగా పాపులర్‌ అయిందని, భాగ్యం వంటి పాత్ర గత ఐదారేళ్లుగా తెలుగు సినిమాల్లో ఎక్కడా కనబడలేదని, క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అందరినీ ఆకట్టుకోవడం ఖాయమని ఐశ్వర్య రాజేష్‌ చెప్పింది.

editor

Related Articles