నిత్యామీనన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ఆరంభం నుండి అభినయంతో కూడిన పాత్రల్లో ఇమిడిపోయి చేస్తోంది. ‘తిరుచిట్రంబళం’ సినిమాకిగాను ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఓ ఇంటర్వ్యూలో సినిమాల ఎంపికలో తన ప్రాధాన్యతల గురించి వివరించింది నిత్యామీనన్. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తీసే కమర్షియల్ సినిమాల్లో నటించడం నాకు ఇష్టం ఉండదు. వాటిలో కథానాయిక పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. అలాంటి అవకాశాలు వస్తే సున్నితంగా తిరస్కరిస్తాను. పాత్ర నచ్చితే చిన్న సినిమా అయినా చేస్తాను. కెరీర్ ఆరంభం నుండి ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నా అని చెప్పింది. ప్రస్తుతం నిత్యామీనన్ విజయ్ సేతుపతితో కలిసి ఓ తమిళ సినిమా చేస్తోంది. దీనితో పాటు ధనుష్ ‘ఇడ్లీకడై’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
- October 23, 2024
0
142
Less than a minute
Tags:
You can share this post!
administrator


