ప్రభాస్ ప్రేమించే పద్ధతిని చూసి, తిరిగి ప్రేమించేస్తాం: చిరంజీవి

ప్రభాస్ ప్రేమించే పద్ధతిని చూసి, తిరిగి ప్రేమించేస్తాం: చిరంజీవి

నేడు ప్రభాస్‌కు పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు, కోస్టార్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రభాస్‌కు మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. ప్రభాస్‌ మిర్చి సినిమాలోని పాపులర్‌ డైలాగ్‌ను చిరంజీవి గుర్తు చేసుకుంటూ.. అతను ప్రేమించే పద్ధతిని చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం.. అంటూనే పుట్టినరోజు శుభాకాంక్షలు.. డార్లింగ్ ప్రేమానురాగాలతో, సుఖసంతోషాలతో రాబోయే ఏడాది గొప్ప కీర్తి ప్రతిష్ఠలు పొందాలని కోరుకుంటున్నాను.. అంటూ ట్వీట్ చేశారు చిరు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారడంతో ప్రభాస్‌ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రభాస్‌ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్‌, ప్రశాంత్‌ నీల్‌తో సలార్ 2, సందీప్‌ రెడ్డి వంగా స్పిరిట్‌తో కలిపి వరుస 3 సినిమాలను లైన్‌లో పెట్టాడు. మరోవైపు చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఇంకా కొనసాగుతోంది.

administrator

Related Articles