తాను నటుడిని కాకపోయి ఉంటే పాలిటిక్స్‌లోకి వెళ్లేవాడినని తెలిపాడు కిరణ్ అబ్బవరం. ‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘దిల్ రుబా’. ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌కి సంబంధించి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు కిరణ్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన జీవితంలోని ఆసక్తికర విషయాలను కూడా కిరణ్ తాజాగా పంచుకున్నాడు. సినిమాలకు రాకముందు జీవితంలో ఎదోఒకటి పెద్దగా సాధించాలనే కోరిక ఎప్పుడూ ఉండేది. అందులో భాగంగానే హీరో అవ్వాలి అనుకున్నాను. అయితే నాకు రాజకీయాలు అంటే చాలా ఇష్టం. రాయలసీమకి చెందిన వ్యక్తిగా రాజకీయాలను చిన్ననాటి నుండి దగ్గరిగా చూశాను. ఒకవేళ నేను సినిమా హీరో కాకపోయి ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్లేవాడిని.

- March 8, 2025
0
49
Less than a minute
Tags:
You can share this post!
editor