జయాపజయాలు నన్ను ప్రభావితం చేయలేవు. వాటి కారణంగా ఆనందంగా లేనని, బాధపడనని నేననను. కానీ అది ఆ క్షణం వరకే. ఫలితం ఏదైనా మరింత ఉత్సాహంగా ముందుకు సాగడమే నాకు తెలుసు. అని అలియాభట్ అన్నారు. గత ఏడాది విడుదలైన ఆమె ‘జిగ్రా’ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ ఫలితంపై అలియా కూడా ఇప్పటివరకూ స్పందించలేదు. రీసెంట్‌గా ‘జిగ్రా’ గురించి ఆమె మాట్లాడారు. ‘నాకు నటన అంటే ఇష్టం. సినిమా అంటే ప్రాణం. అందుకే ఓ వైపు నటిస్తూ, మరో వైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్నా. సినిమాకు సంబంధించి నాకు ఎన్నో గోల్స్ ఉన్నాయి. వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం కష్టపడుతూనే ఉంటా. ఈ క్రమంలో ఎలాంటి ఫలితాలు వచ్చినా పట్టించుకోను. గత ఏడాది ‘జిగ్రా’ సినిమా చేశాను. నిజానికి అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. కొత్తగా ప్రయత్నించాను. దర్శకుడు వాసన్ బాలా కూడా బాగానే తీశారు. కానీ ఫలితం మాత్రం వేరేగా వచ్చింది. కానీ నిరాశపడలేదు. మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నా’ అని చెప్పారు హీరోయిన్ అలియాభట్.

- March 7, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor