దిల్‌రుబా సినిమాను మీ ఎక్స్ లవర్‌తో చూడండంటూ నటుడు కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటుడు కిరణ్ అబ్బవరం మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ రుబా’. ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మార్చి 14, 2025న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు వారం గేప్ కూడా లేకపోవడంతో తాజాగా చిత్రబృందం ట్రైలర్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దిల్ రుబా సినిమాకి వీలైతే మీ లవర్‌తో, కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ మీ ఎక్స్‌తో సినిమాకి వెళ్ళండి. బయటికి వచ్చేటప్పుడు మీరు మీ లవర్, మీ ఎక్స్ ముగ్గురూ చాలా హ్యాపీగా ఫ్రెండ్‌షిప్‌తో బయటికి వస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. ఎక్స్ మీద మనకు ప్రేమ లేకపోవచ్చు కానీ ఫ్రెండ్‌షిప్ అలానే ఉంటుంది. అందుకే ఈ సినిమాను వారితో కలిసి చూడండి అంటూ” చెప్పుకొచ్చాడు. అయితే కిరణ్ కామెంట్లపై నెటిజన్లు వింతగా స్పందిస్తున్నారు. మా ఎక్స్ భర్తను కిరణ్ ఒప్పిస్తాడా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

- March 7, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor