నటి సమంత రెండో పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు మరో వ్యక్తి తోడు అవసరం లేదు అంటూ స్పష్టం చేసింది. ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సామ్.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక తొలి చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్న అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. అయితే, క్యూట్ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట నాలుగేళ్లకే తమ వివాహ బంధానికి స్వప్తి చెప్పేశారు. నాగచైతన్య మాత్రం సామ్‌తో విడిపోయిన తర్వాత రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. మరోనటి శోభితతో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు.
రెండో పెళ్లి గురించి ఓ విలేకరి సామ్‌ను ప్రశ్నించారు. దీనికి సమంత ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు విడిపోయాను. ఇక జీవితంలో రెండో పెళ్లి గురించి నేను ఆలోచించడం లేదు. నాకు మరో వ్యక్తి తోడు అవసరం లేదు. ప్రస్తుతం లైఫ్‌లో హ్యాపీగానే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.