ఎప్పటికపుడు కొత్త కొత్త టెక్నాలజీని తెరపైకి తెస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఇప్పటికే పలు రకాల వెర్షన్ల థియేటర్లు వరల్డ్ వైడ్‌గా పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. థియేటర్ల విషయంలో అప్డేట్గా ఉండే దేశాల జాబితాలో భారత్ కూడా ఉంటుందని ప్రత్యేకించించి చెప్పనవసరం లేదు. త్వరలోనే ఇండియాలో కూడా డాల్బీ సౌండ్ విజన్ థియేటర్ అందుబాటులోకి రానున్నదన్న వార్త ఒకటి మూవీ లవర్స్‌ను ఉత్సాహంలో ముంచుతోంది. పాపులర్ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ హైదరాబాద్‌లోని నార్సింగి సౌకర్యాన్ని కల్పించబోతున్నారు. ఈ విషయాన్ని పుష్ప నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ స్పష్టం చేశారు. డాల్బీ విజన్ థియేటర్ ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే దానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారట. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా సందడిచేయనుంది.
- October 25, 2024
0
147
Less than a minute
Tags:
You can share this post!
administrator


