టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఓపెనింగ్ డే నుండి రికార్డు వసూళ్లతో ట్రెండింగ్ టాపిక్‌గా నిలుస్తున్నాడు పుష్పరాజ్. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రికార్డులు సాధించిన భారతీయ సినిమాలుగా ఇప్పటివరకు బాహుబలి 2, దంగల్ రికార్డులు నమోదు చేశాయి. ముందు నుండి వస్తున్న ట్రేడ్ పండితులు, మూవీ లవర్స్ అంచనాలే నిజమయ్యాయి. ఈ సినిమా తాజాగా రూ.2,200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
పుష్ప 2 ది రూల్ గ్లోబల్ బాక్సాఫీస్ ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టేసింది. పుష్ప 2 తాజా కథనాల ప్రకారం వరల్డ్‌వైడ్‌గా రూ.2200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన భారతీయ సినిమాగా చెరగని ముద్ర వేసింది. అల్లు అర్జున్ అభిమానులతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.