బ్రేక్‌ తీసుకుని ఫారిన్ ట్రిప్‌లో వెంకటేష్..?

బ్రేక్‌ తీసుకుని ఫారిన్ ట్రిప్‌లో వెంకటేష్..?

సంక్రాంతికి వస్తున్నాం  సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్. ఈ సినిమాలో ఐశ్వర్యారాజేష్, మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్‌ రోల్స్‌లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల మార్క్‌కు రీచ్ అయ్యింది. కాగా సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్స్‌తో ఫుల్‌ బిజీగా గడిపిన వెంకటేష్ బ్రేక్‌ తీసుకున్నాడన్న వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం స్కాట్లాండ్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన కూర్గ్‌ (కొడగు)లో ఉన్నాడని ఫిలింనగర్ సర్కిల్‌ సమాచారం ద్వారా తెలిసింది. కూర్గ్‌లోని చల్లని వాతావరణాన్ని, అందమైన ప్రకృతి రమణీయమైన ప్రదేశాలను ఎంజాయ్ చేస్తున్నాడట వెంకీ.

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్‌ కూడా చేయబోతున్నాడని తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్షన్‌లో మరోవైపు సైంధవ్‌ 2 కూడా చేయాల్సి ఉండగా.. ఇంకా ఏ విషయం క్లారిటీగా తెలియడం లేదు.

editor

Related Articles