నాలుగు భాషల్లో ఎన్నో విజయాలు అందుకున్న సుహాసిని ఆరు పదుల వయసులోనూ భార్య, తల్లి, నటి, నిర్మాత, దర్శకురాలిగా ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తోంది. బాబాయ్ ప్రోత్సాహంతో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరిన ఆమె తర్వాత నటిగా మారింది. స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. సుమలత, ఖుష్బూ, రేవతి, లిజీ, రేఖ, పూర్ణిమ.. ఇలా పలువురు హీరోయిన్స్‌తో ఇప్పటికీ మంచి స్నేహం మెయింటైన్ చేస్తుంటుంది సుహాసిని. అయితే సుహాసిని చూడడానికి చాలా అందంగా, పద్దతిగా కనిపిస్తూ అందరి మనసులు ఇప్పటికీ దోచుకుంటోంది. ‘నాకు టీబీ సమస్య ఉంది. కానీ ఆ విషయం తెలిసిన తర్వాత కూడా భయంతో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఎవరికీ ఈ విషయం తెలియకుండా ఆరు నెలల పాటు ట్రీట్‌మెంట్ తీసుకున్నా అని సుహాసిని తెలిపింది. ఇక కొన్నాళ్ల తర్వాత ఈ విషయాన్ని సమాజానికి తెలియజేయాలని, అందరిలో టీబీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్నట్టు సుహాసిని పేర్కొంది. అయితే చికిత్స తీసుకోవడంతో క్రమంగా సమస్య తగ్గుముఖం పట్టిందని సుహాసిని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుహాసిని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

- March 26, 2025
0
14
Less than a minute
Tags:
You can share this post!
editor