దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వచ్చి, తనేంటో నిరూపించుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీకి మరో గొప్ప టాలెంట్ ఉంది. అదేంటంటే టైమ్ దొరికినప్పుడల్లా చెయ్యి తిరిగిన చిత్రకారిణిలా అందమైన పెయింటింగ్స్ వేస్తోంది. పెయింటింగ్ వేస్తున్న సమయంలో చిన్న పిల్లలా మారిపోతానని, దాని అవుట్లెట్ చూసి ఆనందపడతానని పేర్కొంది. ఈ హాబీ వల్ల పని ఒత్తిడి, చిరాకు వంటి సమస్యల నుండి ఈజీగా బయటపడుతున్నానని చెప్పింది. కరోనా ఐసోలేషన్ కాలంలో పెయింటింగ్స్‌పై ఆసక్తి పెంచుకున్నానని, హాబీగా మార్చుకున్నానని వెల్లడించింది. తన పెయింటింగ్స్‌తో తన ఫోటోలను తండ్రి బోనీకపూర్ ఫోటోలు తీస్తూ ఉంటారని, అప్పుడు తాను చిన్నపిల్లలా ఫోజులు ఇస్తూంటానని ఆనందంగా చెప్పింది.
- November 21, 2024
0
927
Less than a minute
You can share this post!
administrator

