తెలుగు ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఇటీవలే బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్‌ను కలిసి ఓ ప్రాజెక్ట్ చేసే విషయమై చర్చించినట్టు వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు హిందీలో పలు సినిమాలు తెరకెక్కించాడని తెలిసిందే. టాలీవుడ్ లీడింగ్ డైరెక్టర్ వంశీపైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని ఇన్‌సైడ్ టాక్. కాగా వంశీపైడిపల్లి ఇటీవలే అమీర్‌ఖాన్‌కు సినిమా లైన్‌ను వినిపించగా.. ఎక్జయిట్ అయిన అమీర్ ఖాన్ పూర్తి స్క్రిప్ట్‌తో రావాలని సూచించాడట. వంశీపైడిపల్లి స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేశాడని.. త్వరలోనే దిల్‌రాజుతో కలిసి ముంబైలో అమీర్‌ఖాన్‌ను కలువబోతున్నాడని బీటౌన్ సర్కిల్‌తోపాటు టాలీవుడ్‌లో వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు ఓకే అయితే మాత్రం దిల్ రాజు హోం బ్యానర్‌లో వంశీపైడిపల్లి- అమీర్‌ఖాన్ కాంబోలో రాబోయే భారీ డీల్ అని చెప్పక తప్పదు.

- November 14, 2024
0
51
Less than a minute
Tags:
You can share this post!
administrator