ఆమె ఒప్పుకుంటేనే సినిమా చేస్తా అన్నాడట!

ఆమె ఒప్పుకుంటేనే  సినిమా చేస్తా అన్నాడట!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి”. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్‌ 18న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో యాంకర్‌ సుమ.. చిత్రబృందంతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ పలు విషయాలను షేర్ చేశారు. విజయశాంతి నటించకపోతే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా చేసేవాడిని కానని దర్శకుడికి స్పష్టంగా చెప్పేశాడట. కథ బాగా నచ్చినా, తల్లిపాత్రకు విజయశాంతి అయితే సరిపోతారని కళ్యాణ్ రామ్ అనుకున్నారట. విజయశాంతి నటిస్తేనే ఈ సినిమా చేస్తానని, లేకపోతే సినిమాని పక్కనపెడదామని కళ్యాణ్ రామ్ క్లియర్‌గా చెప్పేశాడట. ఆ తర్వాత ఈ కథను విని విజయశాంతి ఒప్పుకోవడంతో సినిమా పట్టాలపైకి ఎక్కింది. కాగా ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా కళ్యాణ్ రామ్‌, హీరోయిన్‌గా మంజ్రేకర్ నటిస్తోంది. ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో వేచి చూడాలి.

editor

Related Articles