పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఎప్పుడో విడుదల కావల్సిన ఈ సినిమా తాజాగా మరోసారి వాయిదా పడింది. హరి హర వీరమల్లు సినిమాని తొలుత ఈ నెల 28న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు చెప్పారు. ఇప్పుడు మే 9వ తేదీన సినిమాని విడుదల చేయనున్నట్లు హోలీతో పాటు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనౌన్స్ చేశారు. కొత్త పోస్టర్ విడుదల చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. పోస్టర్‌లో పవన్, నిధి అగర్వాల్ ఇద్దరూ గుర్రపుస్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌తో టీమ్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రిలీజ్ డేట్ ప్రకటించింది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో, పవన్‌కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో రిలీజ్ కానుంది.

- March 14, 2025
0
44
Less than a minute
Tags:
You can share this post!
editor