‘హరిహర వీరమల్లు’ సినిమా నిర్మాత A.M.రత్నం బర్త్ డే వేడుక

‘హరిహర వీరమల్లు’ సినిమా నిర్మాత A.M.రత్నం బర్త్ డే వేడుక

హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే చివరి దశలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాని  నిర్మాత ఎ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే, నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ సెట్స్‌లో ఆయన కేక్ కట్ చేశారు. ఈ వేడుకలో సినిమా యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. తమ ప్రొడ్యూసర్‌కి వారందరూ బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడం సంతోషంగా ఉందని ఎఎం.రత్నం తెలిపారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మార్చి 28న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

editor

Related Articles