నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రాబోయే సినిమా ‘తండేల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఒక అలజడిని సృష్టిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా.. అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆయన ఈ సినిమాకు అందించిన పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఆయన కంపోజింగ్‌లో వచ్చిన తండేల్ ఆల్బమ్ సాంగ్స్‌కు యూట్యూబ్‌లో సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాను పూర్తి ప్రేమకథా చిత్రంగా చిత్ర యూనిట్ రూపొందించారు. ఈ సినిమాకు బన్నీ వాస్ ప్రొడ్యూసర్. ఇక ఈ సినిమా ఆల్బమ్‌కు ఏకంగా 100 మిలియన్ వ్యూస్ రావడం విశేషమనే చెప్పాలి. ఈ సినిమాలోని అన్ని పాటలకు ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ సంతోషంలో ఓలలాడుతోంది.

- January 27, 2025
0
26
Less than a minute
Tags:
You can share this post!
editor