“గుడ్ బ్యాడ్ అగ్లీ”.. అజిత్ ఫ్యాన్స్‌ మంచి ఖుషీగా ఉన్నారు..

“గుడ్ బ్యాడ్ అగ్లీ”.. అజిత్ ఫ్యాన్స్‌ మంచి ఖుషీగా ఉన్నారు..

కోలీవుడ్ అజిత్ కుమార్ హీరోగా నటించిన రీసెంట్ సినిమా “విడా ముయర్చి” వచ్చి పెద్దగా హిట్ కొట్టలేకపోయింది. ఆ సినిమా బాగా ఆలస్యం అవుతూ రావడం ఒక కారణం కాగా ఫ్యాన్స్‌లో తమ హీరో రేంజ్ సినిమా కోసం ఆసక్తి ఎక్కువయ్యింది. దీంతో ఇక అంచనాలు అన్నీ అజిత్ ఫ్యాన్ డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ సినిమా “గుడ్ బ్యాడ్ అగ్లీ” పైనే అంచనాలు నెలకొన్నాయి. మన టాలీవుడ్ తమిళ్‌లో ప్రతిష్టాత్మకంగా చేసిన ఈ సినిమా సూపర్ ఫాస్ట్‌గా కంప్లీట్ అయ్యింది. ఇక నిన్న వచ్చిన టీజర్ అయితే మళ్ళీ అజిత్ ఫ్యాన్స్‌కి కావాల్సిన ఫుల్‌మీల్స్ పెట్టింది అని చెప్పవచ్చు. చాలాకాలం నుండి మిస్ అవుతున్న అజిత్‌ని మళ్ళీ మైత్రి నిర్మాతలు ప్రెజెంట్ చేశారు. దీంతో ఇపుడు అజిత్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. డెఫినెట్‌గా గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం సెన్సేషనల్ ఓపెనింగ్స్, ఒకవేళ మంచి టాక్ వస్తే తమిళనాట రికార్డులు తిరగరాస్తుంది అనే రేంజ్‌లో ఫ్యాన్స్‌ ఖుషీగా ఉన్నారు.

editor

Related Articles