జాన్వీకపూర్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా రూ.5 కోట్ల కారు పంపిన ఫ్రెండ్..!

జాన్వీకపూర్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా రూ.5 కోట్ల కారు పంపిన ఫ్రెండ్..!

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను అందించింది బిర్లా వారసురాలు అనన్య బిర్లా. దాదాపు రూ. 5 కోట్ల విలువైన లంబోర్ఘిని కారును ఆమెకు కానుకగా పంపించారు. శుక్రవారం ఉదయం లిలాక్ (పర్పుల్) రంగు లంబోర్ఘిని కారు జాన్వీ నివాసానికి చేరుకుంది. ఈ కారుతో పాటు మరో గిఫ్ట్ ప్యాక్ కూడా ఉంది, దానిపై “ప్రేమతో, నీ అనన్య” అని రాసి ఉంది. అన‌న్య విష‌యానికి వ‌స్తే.. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా పెద్ద‌ కుమార్తె. అనన్య బిర్లా, జాన్వీ కపూర్‌లు చాలాకాలంగా మంచి ఫ్రెండ్స్. ఇటీవల అనన్య బ్యూటీ ప్రోడ‌క్ట్స్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు ప్రకటించారు. అయితే ఈ బ్రాండ్‌కు జాన్వీ కపూర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. తన బ్రాండ్ కోసం జాన్వీ సహకరిస్తున్నందుకు కానుకగా అనన్య ఈ ఖరీదైన లంబోర్ఘిని కారును జాన్వీకి బహుకరించారని టాక్.

editor

Related Articles