ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువ జామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు… కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడటంతో ఆమె శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నట్టు తెలుస్తోంది. టీటీడీ అధికారులు ఆమెకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో స్వాగతం పలికారు.. దర్శనం అనంతరం అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా క్షేత్ర సంప్రదాయం ప్రకారం ఆమె మొదట శ్రీభూ వరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత శ్రీపద్మావతి విచారణ కేంద్రం దగ్గర కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అన్నా లెజినోవా క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి కావడంతో, హిందూమతాన్ని గౌరవిస్తున్నానని డిక్లరేషన్‌పై సంతకం చేశారు. తనకు పూర్తి విశ్వాసం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు. అనంతరం ఆమె గాయత్రీ నిలయంలో ఆదివారం రాత్రి బస చేశారు. అయితే తన తనయుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం బారిన పడగా, ఆ సమయంలోనే అన్నా తిరుమల స్వామి వారిని మొక్కుకున్నారట. క్షేమంగా మార్క్ శంకర్ బయటపడిన నేపథ్యంలో మొక్కులు చెల్లించుకున్నారు.

- April 14, 2025
0
7
Less than a minute
Tags:
You can share this post!
editor