హ‌నుమాన్ జయంతి సందర్భంగా.. విశ్వంభ‌ర సినిమాలో రామ రామ సాంగ్ రిలీజ్..

హ‌నుమాన్ జయంతి సందర్భంగా.. విశ్వంభ‌ర సినిమాలో రామ రామ సాంగ్ రిలీజ్..

హీరో చిరంజీవి న‌టిస్తున్న తాజా సినిమా విశ్వంభ‌ర‌. ఈ సినిమాని బింబిసార ఫేం దర్శకుడు వశిష్ట పూర్తి సోషియో ఫాంటసీ సినిమాగా తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వార్తలు బయటకు వచ్చినా కూడా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా గ‌మ‌నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా సినిమా నుండి రామ రామ సాంగ్ విడుద‌ల కానున్న‌ట్టు తెలియ‌జేశారు. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ‘విశ్వంభర’ నుండి ఆ పాట విడుద‌లైంది. రాములోరి గొప్ప చెప్పుకుందామా… ‘రాములోరి గొప్ప చెప్పుకుందామా… సాములోరి పక్కన ఉన్న సీతమ్మ లక్షణాలు చెప్పుకుందామా అంటూ సాగే ఈ గీతాన్ని రామ జోగయ్య శాస్త్రి రాశారు. ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి బాణీలు అందించారు. శంకర్ మహదేవన్, లిప్సిక అద్భుతంగా ఆలపించారు. పాట ప్రారంభంలో ‘జై శ్రీరామ్’ అంటూ వచ్చే చిరంజీవి వాయిస్ ఒకటి డివోషనల్ వైబ్ తీసుకొచ్చింది అనే చెప్పాలి.

editor

Related Articles