సినీ డైరెక్టర్ రమేష్ కృష్ణ మిస్సింగ్, కేసు నమోదు…

సినీ డైరెక్టర్ రమేష్ కృష్ణ మిస్సింగ్, కేసు నమోదు…

హైదరాబాద్‌లో సినిమా డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ  అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్‌లోని ఫ్రెండ్స్ కాలనీలో నివాసముంటున్న రమేష్ కృష్ణ ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు రమేష్ కృష్ణ కోసం వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో తన భర్త కనిపించడం లేదంటూ రమేష్ కృష్ణ భార్య శ్రీదేవి మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. తన భర్త ఈ నెల 4న ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా ఇండస్ట్రీలో రమేష్ కృష్ణతో పనిచేసిన ఫ్రెండ్స్‌ని విచారిస్తున్నారు.

editor

Related Articles