తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో సమంత ఒకరు. సిటాడెల్ వెబ్ ప్రాజెక్ట్‌తో బిజీగా మారిన ఈ బ్యూటీ.. విడుదల తర్వాత రిలాక్సేషన్ మూడ్‌లోకి వెళ్లింది. సమంత క్రిస్మస్, న్యూ ఇయర్ సెల్రబేషన్స్ కోసం యూఎస్ టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. యూఎస్‌లో తన వర్కౌట్ సెషన్‌తోపాటు ఇతర కార్యకలాపాల గురించి అప్‌డేట్స్‌ను నెట్టింట షేర్ చేసుకుంది. అయితే సామ్ తన లాంగ్ ట్రిప్ వెకేషన్ ముగించుకొని ఇండియాకు తిరిగొచ్చేసింది. బుధవారం చెన్నై, ముంబైలో జరిగిన ఈవెంట్స్‌లో పాల్గొంది. చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ కోసం చెన్నై సూపర్ చాంప్స్ జెర్సీని లాంచ్ చేసింది. ఈవెంట్ ముగిసిన తర్వాత ముంబైకి పయనమైంది.
మళ్లీ చాలాకాలం తర్వాత తన కొత్త వెబ్ సిరీస్ షూటింగ్‌లో జాయిన్ అయింది. విజయ్ దేవరకొండతో చివరగా ఖుషి సినిమాలో నటించింది సమంత. ఈ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ కొత్త సినిమా ఏమీ చేయలేదు.