ఇంటర్‌లో ఉండగానే ప్రేమలో పడిపోయా!

ఇంటర్‌లో ఉండగానే ప్రేమలో పడిపోయా!

ఇటీవల తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీతో కలిసి పెళ్లి పీటలెక్కింది హీరోయిన్ కీర్తి సురేష్‌. గోవా వేదికగా వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనీతో ప్రేమ, పెళ్లి గురించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది కీర్తి సురేష్‌. ఇంటర్‌ చదువుతున్నప్పుడే ఆంటోని ప్రేమలో పడిపోయానని, దాదాపు 15 ఏళ్లుగా తమ ప్రేమాయణం కొనసాగుతోందని చెప్పింది. ఆంటోని నాకంటే ఏడేళ్లు పెద్ద. 2010లో తను నాకు తొలిసారి లవ్‌ప్రపోజ్‌ చేశాడు. అప్పుడే నాకు ప్రామిస్‌ రింగ్‌ను బహుమతిగా ఇచ్చాడు. దానిని ఇప్పటివరకు తీయలేదు. మేమిద్దరం గత రెండేళ్లుగా పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాం. డిసెంబర్‌లో వివాహబంధంలోకి అడుగుపెట్టాం.

editor

Related Articles