నానాపటేకర్ గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఆయన సినిమాలు ఆయన చూడరు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం ఆయనే ఓ ఇంటర్‌వ్యూలో తెలియజేశారు. ఆయన సినిమాలు చూడ్డం కూడా తక్కువే. ఇటీవల నానా పటేకర్ చూసిన సినిమా ‘యానిమల్’. ఈ విషయాన్ని తన తాజా చిత్రం ‘వనవాస్’ ప్రమోషన్‌లో భాగంగా నానాపటేకర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు . ‘యానిమల్’లో కీలక పాత్ర పోషించిన అనిల్ కపూర్ ఈ ఇంటర్వ్యూకి హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం. నానా పటేకర్ మాట్లాడుతూ ‘నేను సినిమాలు చూడటం అరుదు. నా స్నేహితుల బలవంతం చేయడంతో ‘యానిమల్’ చూశాను. అది కూడా కేవలం అనిల్ కపూర్ కోసం. ఆ సినిమా చూశాక అనిల్‌కి కాల్ చేశాను. ‘అనిల్-మాల్’ చూశాను అని చెప్పాను గుర్తుందా?’ అని ఎదురుగా ఉన్న అనిల్‌కపూర్‌ని ప్రశ్నించారు నానా పటేకర్. ఇంకా మాట్లాడుతూ ‘ఆ సినిమాలో పరిధి మేరకు నటించింది అనిల్ మాత్రమే. ఆయన నటన సమయానుకూలంగా అనిపించింది. మిగతా వాళ్లంతా ఓవరాక్షన్ చేశారనిపించింది’ అంటూ వ్యాఖ్యానించారు నానా పటేకర్.
- November 23, 2024
0
107
Less than a minute
You can share this post!
editor


