హాలీవుడ్‌లో నటించడం గౌరవంగా భావించే భారతీయ నటులు కోకొల్లలు. అందునా.. ‘అవతార్’ లాంటి సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా?!. కానీ బాలీవుడ్ హీరో గోవిందా వదులుకున్నారట. ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘అమెరికాలో సర్దార్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. అతనికి బిజినెస్‌లో ఓ ఐడియా ఇచ్చా. అది బాగా వర్కవుట్ అయ్యింది. దాంతో తను బాగా సంపాదించాడు. ఓ రోజు జేమ్స్ కామెరూన్ దగ్గరకు సర్దార్ నన్ను తీసుకెళ్లాడు. ఆ దిగ్గజ దర్శకుడితో కలిసి డిన్నర్ చేశా. అప్పుడే ఆయన నాకు ‘అవతార్’ గురించి చెప్పారు. కథను కూడా చూచాయగా వివరించారు. అందులో కీలకమైన ‘స్పైడర్’ పాత్రను నన్ను వేయమన్నారు. 18 కోట్లు ఆఫర్ ఇచ్చారు. 410 రోజులు పనిచేయాలని చెప్పారు. నేను ఓకే అన్నాను. కానీ శరీరానికి పెయింట్ పూసుకొని నటించాలన్నారు. దాంతో ఆ ఆఫర్‌ని వదులుకున్నా. సినిమా విడుదలయ్యాక.. నాకు ఆఫర్ చేసిన పాత్రలో నటించిన నటుణ్ణి చూసి ఆశ్చర్యపోయాను.

- March 11, 2025
0
39
Less than a minute
Tags:
You can share this post!
editor