తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన సినిమా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ‘ఓరి దేవుడా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా రెండు చోట్లా సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇప్పుడు హిందీలో విడుదల కాబోతుంది. మరి తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో విజయం సాధించినట్లుగానే.. హిందీలో కూడా ఈ సినిమా విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి. కాగా హిందీలో ఈ సినిమా ఇప్పుడు మార్చి 14, 2025న బాలీవుడ్‌లో విడుదల కాబోతుంది. ప్రేమ, కాలేజ్ జీవితం, కాలేజ్ తర్వాత విద్యార్థుల జీవితాలు వంటి అనేక ఇతివృత్తాలతో కూడిన సినిమా ఇది. పైగా ఈ సినిమా పూర్తిగా లవ్, రొమాన్స్, యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. అందుకే, హిందీలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

- March 10, 2025
0
14
Less than a minute
Tags:
You can share this post!
editor