టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ సినిమాలలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం ఎంతో కొంత చేయాలని తపన పడ్డాడు. రాజకీయాలలోకి వచ్చిన పదేళ్ల తర్వాత అఖండ మెజారిటీతో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల ముందు ఓవైపు సినిమా షూటింగులు, మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా గడిపిన పవన్ ఇప్పుడు సినిమాలు చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ కార్యక్రమాలతోనే బిజీగా ఉన్నారు. అయితే ముందు కమిటైన సినిమాలని పూర్తి చేసేందుకు చాలా కష్టపడుతున్నారు. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తారా లేదా అనే సందేహం కూడా కలుగుతోంది. అయితే ఆయన రానున్న రోజులలో సినిమాలు చేస్తారా, లేదా అనే దానిపై అందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కెరీర్‌పై నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన తాజా సినిమా ‘మ్యాడ్ స్క్వేర్ మార్చి 28న రిలీజ్ కాబోతున్ననేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే నాగవంశీతో సినిమా యూనిట్ ఓ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా సితార బ్యానర్‌లో 50వ సినిమా పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లలో ఎవరితో చేయిస్తారని వంశీని హీరో సంగీత్ శోభన్ ప్రశ్నించడంతో దానికి నాగ వంశీ ఆసక్తికర సమాధానం చెప్పారు. పవన్ ఈ రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తాడనేది కోరుకోవాలి కానీ, సినిమా చేయాలని కోరుకోకూడదని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకోవాలే తప్ప ఆయన మనతో సినిమా చేయాలని కోరుకోకూడదు. పవన్ మంచి పొజిషన్‌కి వెళ్లి మన రాష్ట్రానికి ఏం చేస్తాడు.. దేశానికి ఏం చేస్తాడు అని మనం అందరం అనుకోవాలి. అయితే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఎంత త్వరగా 50వ సినిమా జరిగితే, అది తారక్ తోనే జరగాలని నేను భావిస్తున్నాను అని నాగవంశీ అన్నాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశం అయ్యాయి. నిజంగానే పవన్ సినిమాలకి గుడ్ బై చెప్పేస్తాడా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.

- March 21, 2025
0
39
Less than a minute
Tags:
You can share this post!
editor