వెంకటేష్‌తో ఓ కొత్త సినిమా చేయాలనుకుంటున్న వినాయక్?

వెంకటేష్‌తో ఓ కొత్త సినిమా చేయాలనుకుంటున్న వినాయక్?

డైరెక్టర్ వి.వి. వినాయక్ గత కొన్నేళ్లుగా సైలెంట్‌గా ఉంటున్నారు. ఎట్టకేలకు ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారని టాలీవుడ్‌లో టాక్. హీరో విక్టరీ వెంకటేష్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు మళ్లీ రూమర్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా వెంకటేష్‌కి వినాయక్ ఓ కథ చెప్పాడని, వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. మరి ఈ రూమర్స్‌లో వాస్తవం ఎంత ఉందో గానీ, వినాయక్ సినిమాపై మాత్రం ఎప్పటి నుండో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. అన్నట్టు ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి నిర్మించొచ్చని సినీ వర్గాలంటున్నాయి. ఈ ముగ్గురి కాంబోలో 2006లో వచ్చిన ‘లక్ష్మీ’ సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఐతే, ఈ మధ్య వినాయక్ సక్సెస్ ట్రాక్‌లో లేడు. కాబట్టి.. ఎలాగైనా సక్సెస్‌ను కొట్టాలనే కసితో వినాయక్ తన తర్వాత సినిమా కోసం పనిచేస్తున్నాడట. మరి, వెంకటేష్ ఇమేజ్ కోసం వినాయక్ ఎలాంటి కథ రాశాడో చూడాలి. అన్నట్టు ఆ మధ్య వినాయక్, బాలయ్యతో కూడా సినిమా చేయాలనుకున్నాడు. ప్రస్తుతానికి అయితే వినాయక్, వెంకీతో సినిమాని తీయాలని ఆలోచనలో ఉన్నారు.

editor

Related Articles