హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ సినిమాని రిలీజ్‌కు రెడీ చేస్తున్న ప్రభాస్, మరో డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ అనే సినిమాలో ప్రభాస్ నటించబోతున్నాడు. ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ రోజు నుండే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే, ఈ సినిమా కోసం ప్రభాస్ పూర్తి ఫిజిక్‌తో మంచి బలిష్టంగా తయారుకాబోతున్నాడు. కాగా, ఈ సినిమా షూటింగ్‌ను మే నెల చివరినాటికి ప్రారంభించేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు మూడు నెలల టైమ్ గేప్ ప్రభాస్‌కు దొరికినట్లే. మరి స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ ఎలాంటి లుక్‌లోకి వస్తాడో వేచి చూడాలి.

- February 22, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor