డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్’ యాక్షన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఏకంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ విడుదలై ఈ ఆదివారంతో ఏడాది పూర్తయింది.ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్ ‘సలార్’ గురించి మాట్లాడుతూ ‘సలార్: పార్ట్-1’ నాకు నిరాశగానే అనిపించింది. ఎక్కడో ‘కేజీయఫ్ 2’ ఛాయలు కనిపించాయి. అయితే ‘సలార్ 2’ మాత్రం నా కెరీర్‌లో బెస్ట్ మూవీగా ప్రేక్షకులను అంచనాలను మించేలా తీస్తాను అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో మూవీ చేస్తున్నారు. మరో వైపు ప్రభాస్ కూడా వరుస సినిమాలో బిజీగా ఉన్నందున ఈ సినిమా రావడానికి చాలా సమయమే పట్టేలా ఉంది. ఇటీవలే ‘సలార్ 2’ పనులు మొదలు పెట్టినట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు..